Sunday, April 6, 2025

కాంగ్రెస్‌లో కోవర్టులు ఎవరూ లేరు.. అపోహ మాత్రమే: జానారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్‌లో కోవర్టులు ఎవరూ లేరుని, అది అపోహ మాత్రమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. గురువారం గాంధీ భవన్ లో డిగ్గీరాజాతో భేటీ అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ.. అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలను బహిరంగంగా తెలియజేయడం సరికాదన్నారు. అన్ని అంశాలపై దిగ్విజయ్ సింగ్ మీడియాకు వెల్లడిస్తారని చెప్పారు. పార్టీ ఐక్యతగా ఉండటానికి, అందరం కలిసి పార్టీని పటిష్టం చేయడానికి, అపోహలను తొలగించుకోవడం ఎలా అనేక అంశాలపై ఆయనతో చర్చించినట్టుగా తెలిపారు.

వీటిపై ఆయనకు తాను కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్టుగా చెప్పారు. పార్టీ నేతలు అందరం పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో అందరం ఐకమత్యంతో ముందుకు వస్తామని తెలిపారు. పార్టీలో కోవర్టులు ఎవరూ లేరని అన్నారు. కోవర్టులు ఎవరూ లేరని.. అది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News