Wednesday, January 22, 2025

మచిలీపట్నం ఎంపి అభ్యర్థిని ప్రకటించిన జనసేన

- Advertisement -
- Advertisement -

మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి ఎంపి అభ్యర్థిని జనసేన ప్రకటించింది. వల్లభనేని బాలసౌరిని మచిలీపట్నం నుంచి లోక్ సభ బరిలో దింపుతున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాన్ వెల్లడించారు. టడిపి, బిజెపి పార్టీలతో పొత్తులో భాగంగా ఎపిలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో జనసేనకు రెండు ఎంపి స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 21 స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది.

కాగా, ఇప్పటివరకు 18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. మరో మూడు స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఈ సారి పవన్ కళ్యాన్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పర్యటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News