Sunday, January 19, 2025

‘వారాహి’తో.. పవన్ యుద్ధభేరి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : జనసేన ప్రచార వాహనానికి సంబంధించి వీడియో, ఫోటోలను పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ వాహనానికి ’వారాహి’ పేరు పెట్టినట్టు పవన్ పేర్కొన్నారు. ’వారాహి… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అని ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎపి పర్యటన కోసం ప్రచార వాహనం సిద్ధమైంది. సిద్ధమైన వాహనాన్ని, ట్రయల్ రన్‌ను బుధవారం పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో పరిశీలించారు.

వాహనాన్ని తీర్చిదిద్దిన సాంకేతిక నిపుణులతోనూ చర్చించారు. ’వారాహి’ వాహనాన్ని ప్రత్యేక భద్రతా చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. వాహనంపై ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ఆధునిక సౌండ్ సిస్టం వినియోగించారు. నలువైపులా సిసి కెమెరాలు అమర్చారు. జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రచార వాహనానికి ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ నిర్ణయించారు‘ అని జనసేన నాయకులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News