Monday, December 23, 2024

ఎపి మహిళా కమిషన్‌కు జనసేన కౌంటర్

- Advertisement -
- Advertisement -


మన తెలంగాణ, హైదరాబాద్: మూడు పెళ్ళిళ్ళ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్‌కు నోటీసులు జారీ చేయడంపై జనసేన కౌంటర్ ఇచ్చింది. మహిళా కమిషన్‌కు ప్రశ్నలను సంధిస్తూ జనసేన ట్వీట్ చేసింది. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నలను సంధించింది. ఎపి వుమెన్ కమిషన్ ఎక్స్‌పోజ్డు అనే హ్యాష్ ట్యాగ్‌తో జనసేన చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విజయవాడ నగరంలో 23 ఏళ్ళ దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు ఎపి మహిళా కమిషన్ ఏం చేసిందని జనసేన ప్రశ్నించింది. అత్యాచారాలకు తల్లి పెంపకమే లోపమని రాష్ట్ర హోంమంతి ప్రకటించారని గుర్తు చేస్తూ.. ఈ ప్రకటన మహిళా లోకాన్ని, మాతృమూర్తులను అవమానించండం కాదా? అని నిలదీసింది.

ఈ ఏడాది మే నెలలో సిఎం జగన్ సొంత కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దళిత మైనర్ బాలికపై సుమారు ఏడాది పాటు అత్యాచారం జరిగిందని, దీనిపై మహిళ కమిషన్ ఏం చర్యలను తీసుకుందని జనసేన ప్రశ్నించింది. ఎంపీ హోదాలో ఉంటూ అసభ్యకరమైన వీడియో కాల్‌తో దొరికిన వ్యక్తిని వైసీపీ ప్రభుత్వం వెనుకేస్తుందని, దీనిపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీసింది. రాష్ట్ర మంత్రి అండతో గుడివాడలో సంక్రాంతి సంబరాల పేరుతో చీరగళ్ళ్ ను ఏర్పాటు చేసి, వారిని భోగ వస్తువుగా చూపించనప్పుడు మహిళా కమిషన్ ఎక్కడ ఉందని జనసేన ప్రశ్నించింది.

ఇంటెలిజెన్స్ రిపోర్టు పేరుతో జనసేనపై మరో కుట్ర: నాదెండ్ల

మన తెలంగాణ, హైదరాబాద్: ఇంటెలిజెన్స్ రిపోర్టు పేరుతో జనసేనపై మరో కుట్ర తెరలేపారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రోజు రోజుకి జనసేన పార్టీకి ప్రజలలో పెరుగుతోన్న జనాదరణను చూసి అసూయ చెందుతున్న అధికార వైఎస్సార్ సిపి పార్టీ ఇలాంటి కుట్రలకు వ్యూహరచన చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఆదివారం మీడియాతో నాదెండ్ల మాట్లాడారు.. వైసీపీ ప్రభుత్వంలోని 13 మంది మంత్రులు, ప్రజా ప్రతినిధులపై జనసేన శ్రేణులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అంటూ సాగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటమే జనసైనికులకు తెలుసన్నారు. వైసీపీ పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని జనసేన శ్రేణులకు ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News