Monday, December 23, 2024

తెలంగాణలో ఎన్నికల పోటీకి జనసేన కసరత్తు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా 32 నియోజవర్గాల్లో కార్యనిర్వహకులను నియమించింది. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కార్యనిర్వాహకులను నియమించామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు. కొత్తగా కార్యనిర్వాహకులుగా బాధ్యతలు చేపట్టిన వారంతా ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితులపై పార్టీకి నివేదికలను అందజేస్తారన్నారు. నివేదికల ఆధారంగానే నియోజకవర్గాల్లో జనసేన తరపున అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులుగా నియమించబడిన వారిలో.. మండపాక కావ్య (సనత్ నగర్ ), ఎస్. రమేష్ (జూబ్లీహిల్స్ ), బిట్ల రమేష్ (ముషీరాబాద్ ), నడిగడ్డ నాగేంద్రబాబు (కూకట్ పల్లి), దామరోజు వెంకటాచారి (మల్కాజ్ గిరి), పొన్నూరు లక్ష్మీ సాయి శిరీష (ఎల్బీ నగర్ ), చిరాగ్ ప్రజీత్ గౌడ్ (శేర్ లింగంపల్లి), తేజావత్ సంపత్ నాయక్ (వైరా), సైదాల శ్రీనివాస్ (మంచిర్యాల), కత్తి సైదులు (కంటోన్మెంట్), మూల హరీష్ గౌడ్ (రామగుండం), వంగ లక్ష్మణ్ గౌడ్ (నాగర్ కర్నూల్), బైరపోగు సాంబశివుడు (కొల్లాపూర్), మిరియాల రామకృష్ణ (ఖమ్మం), వేముల కార్తీక్ (కొత్తగూడెం), కూనా వేణు (సంగారెడ్డి), బండి నరేష్ (సత్తుపల్లి), డేగల రామచంద్రరావు (అశ్వారావు పేట), గోకుల రవీందర్ రెడ్డి (మునుగోడు), యడను రాజేష్ (పఠాన్‌చెరువు), సరికొప్పుల నాగేశ్వర రావు (హుజూర్ నగర్ ), చెరుకుపల్లి రామలింగయ్య (నకిరేకల్), నైని ముకుంద నాయుడు (వనపర్తి), దాసరి పవన్ (సిద్దిపేట), తగరపు శ్రీనివాస్ (హస్నాబాద్), బెక్కం జనార్దన్ (జగిత్యాల), గాదె ఫృద్వీ (స్టేషన్ ఘనాపూర్), మెరుగు శివకోటి యాదవ్ (నర్సంపేట) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News