Thursday, December 19, 2024

పవన్ కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాన్‌కు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. జనసేన పార్టీకి కామన్ సింబల్ ’గ్లాసు’ గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గతంలో గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పేర్కొన్న విషయం విదితమే. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరోవైపు, మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో ’టార్చ్‌లైట్ ’ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News