Monday, January 20, 2025

జానీ మాస్టర్‌కు జనసేన షాక్..

- Advertisement -
- Advertisement -

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై జనసేన పార్టీ చర్యలు తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్‌ను జనసేన ఆదేశించింది. తనను లైంగికంగా వేధించాడిన జానీ మాస్టర్‌పై ఓ మహిళా డ్యాన్సర్ సోమవారం రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది. జానీ మాస్టర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ.. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని జనసేన ప్రకటనను విడుదల చేసింది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్.. జనసేన పార్టీలో జాయిన్ అయి గత అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన సంగతి తెలిసిందే.

కాగా.. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని… చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు, నార్సింగి అక్కాపురి టౌన్ షిపులోని నివాసంలో కూడా తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆమె నార్సింగి పరిధిలో నివసిస్తుండడంతో ఈ కేసును నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. అతడిపై ఐపిసి సెక్షన్ 376 (అత్యాచార), క్రిమినల్ బెదిరింపు (506), స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News