Monday, December 23, 2024

మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనసేన ఆవిర్భావ సభ ఈ నెల 14న మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేసేలా సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఈ మహాసభలో పార్టీ అద్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. జనసేన ఆవిర్భావ సభ స్థలాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ఆవిర్భావ సభ జరుగనుందని ఆయన తెలిపారు.

సభ నిర్వహణకు రైతులు 34 ఎకరాలను స్వచ్చందంగా ఇచ్చారని, అదనంగా మరో 60 ఎకరాల భూమిని సభ అవసరాల నిమిత్తం ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారని తెలిపారు. లక్షలాది మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. సభ నిర్వహణ కోసం నియోజకవర్గానికి ఇద్దరి చొప్పున సమన్వయకర్తలను వేస్తున్నారు. వారికి అదనంగా మరో సమన్వయకర్త ఉంటారని ఆయన వివరించారు. వివిధ విభాగాల పర్యవేక్షణ నిమిత్తం కమిటీలు వేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News