శాంతి కృష్ణకు ‘కళావిరాట్’ బిరుదుల ప్రదానోత్సవం
హైదరాబాద్: జనం సమస్యలను తన సమస్యలుగా భావించి సానుకూలంగా పరిష్కారాలను చూపిస్తున్న ప్రజా నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకు జనబంధు బిరుదును ఆగస్టు 2న రవీంద్ర భారతి వేదికపై జాతీయ, అంతర్జాతీయ అతిరథ మహారధుల సమక్షంలో బహుకరించి సగౌరవంగా సత్కరించనున్నారు. అసెంబ్లీకి వరుసగా ఆరుసార్లు వర్ధన్నపేట, పాలకుర్తి శాసనసభ నియోజకవర్గాల నుండి శాసన సభ్యులుగా ఒకసారి వరంగల్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయి ప్రజల మన్నలు పొంది అనునిత్యం ప్రజల కోసం ప్రజల మధ్య ఉంటూ జననేతగా ప్రశంసలు పొందునేత నేత ఎర్రబెల్లి.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెయ్యికి పైగా మన సంస్కృతీ, సాంప్రదాయాలపై సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి లక్షకు పైగా కళాకారిణి, కళాకారులచే వేదికలపై కళా ప్రదర్శనలను ఇప్పించి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బతుకమ్మ తల్లి జన్మస్థలమైన చౌటపల్లి గ్రామవాసి ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత డా. వంగాల శాంతి కృష్ణ ఆచార్యకి ‘విశ్వ కళావిరాట్‘ బిరుదుతో సత్కరించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘ అధ్యక్షులు, బ్రహ్మర్షి డా. రామడుగు నరసింహాచార్య స్వామీజీ సత్కరించి ఆశీస్సులు అందజేయనున్నారని జ్యోతిష్య పురోహితరత్న డా. పోలోజు భాస్కరాచార్యులు తెలియజేశారు. సేవా, కళా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు సేవారంగంలో డా. శాంతి కృష్ణ ఆచార్యకి కళా రంగంలో ప్రతిష్టాత్మక బిరుదులతో సత్కరించడం పట్ల రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, కళాకారులు, కళాభిమానులు అభినందనలు అందజేశారు.