Thursday, December 26, 2024

సిఎం కెసిఆర్ వల్లే జనగామకు మెడికల్ కాలేజీ

- Advertisement -
- Advertisement -

జనగామ ఎడ్యుకేషన్ : సిఎం కెసిఆర్ వల్లే జనగామ జిల్లా, జనగామలో మెడికల్ కాలేజీ ఏర్పాటు జరిగిందని, ఆయకు ఎంతో రుణపడి ఉంటామని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జనగామ మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రగతి ఉత్సవాలు నిర్వహించగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం స్థానిక వైష్ణవి గార్డెన్స్ వరకు జాతీయ జెండాలు, మునిసిపల్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వైష్ణవి గార్డెన్స్‌లో డీసీపీ సీతారాం, మునిసిపల్ చైర్‌పర్సన్ పోకల జమున, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. జనగామ పట్టణంలో గతంలో 2,200 మందికి ఆసరా పింఛన్లు వచ్చేవని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 6,283 మందికి వస్తున్నాయని తెలిపారు.

ఈ సంవత్సరం 100 సీట్లతో మెడికల్ కళాశాల ప్రారంభం అవుతుందని, ఈ కళాశాలల్లో జిల్లా విద్యార్థులకు ఎక్కువ అవకాశం ఉంటుందని, జనగామ మునిసిపల్ అభివృద్ధిలో రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని, కేంద్రం అవార్డు ఇచ్చింది కానీ నిధులు మాత్రం ఇవ్వలేదని, జనగామ పట్టణంలో కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని, జనగామ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం మున్సిపల్ ప్రజలకు బ్యాంక్ లింక్ ద్వారా రూ.768,50,000 చెక్కును పంపిణీ చేశారు. మున్సిపల్ డ్రైవర్ ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.5లక్షల బీమా చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ పట్టణ వార్డుల కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News