హైదరాబాద్: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. అబిడ్స్ దగ్గర గీతాలాపనలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. మంగళవారం ఉదయం సరిగ్గా 11.30 గంటలకు నిమిషం పాటు ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యా సంస్థలు, ప్రైవేటు సంస్థల వద్ద సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించారు. మెట్రో రైలు సహా ఆర్‌టిసి బస్సులు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేసి గీతాలాపన చేశారు. అబిడ్స్ వద్ద జరిగిన గీతాలాపనలో ఎంపిలు కేశవరావు, అసదుద్దీన్ ఓవైసి, మంత్రులు మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, యువత పాల్గొన్నారు. బాన్సువాడ నుండి హైదరాబాద్ విచ్చేస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి 11.30 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన తన కాన్వాయ్ ను ఆపి సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు.
సామూహిక జాతీయ గీతాలాపనతో మార్మోగిన తెలంగాణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -