Sunday, December 22, 2024

ఆద్యంతం నవ్వించే చిత్రం

- Advertisement -
- Advertisement -

వర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యా నర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అ యితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశా రు. ఈనెల 7న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీ జ్ కానుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ “జనక అయితే గనక సెన్సార్ అ యింది. యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇదివరకే టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.

సుహాస్ తన ప్రతి సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూనే ఉ న్నాడు. కొత్త కథలను చెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానే ఉంటుంది. కాకపోతే ఈ సినిమా కథ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కాస్త పక్కకు జరి గి ఈ కథను చేసినా ఆ లైన్ దాటకుండా తీశాం. ఆడియన్స్‌ను ఎడ్యుకేట్ చేసేలా సినిమా ఉంటుంది. సినిమా ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది” అని అన్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల మాట్లాడు తూ.. “ప్రశాంత్ నీల్ టీంలోకి నన్ను దిల్ రాజు పంపారు. అక్కడ చాలా నేర్చుకున్నా ను. ప్రశాంత్ నీల్‌కి ఈ కథ తెలుసు. బా గుందని మెచ్చుకున్నారు” అని తెలిపారు. సు హాస్ మాట్లాడుతూ.. “స్క్రిప్ట్ విన్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోదాటి పీకే, విజయ్ బుల్గానిన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News