Tuesday, December 17, 2024

ఆద్యంతం నవ్వించే సినిమా జనక అయితే గనక

- Advertisement -
- Advertisement -

సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా ‘జనక అయితే గనక’ అనే చిత్రాన్ని సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. దసరా సందర్భంగా ‘జనక అయితే గనక’ శనివారం విడుదల కానుంది. ఇక ఈ చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు బలగం వేణు, వశిష్టలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. “ఇలాంటి చిన్న చిత్రాలు తీయాలనే ఆతృత, భయం రెండూ ఉంటాయి. చిన్న చిత్రాలతోనే ఎక్కువ టాలెంట్ బయటకు వస్తుంది. ఈ చిత్రం బాగా ఆడితేనే టెక్నీషియన్లు, ఆర్టిస్టులకు మంచి పేరు, ఆఫర్లు వస్తాయి.

ఆద్యంతం నవ్వించేలా ఈ చిత్రం ఉంటుంది”అని అన్నారు. డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. “ఇంత సెన్సిటివ్ పాయింట్‌ను, ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా చేశారు. ఇలాంటి పాయింట్‌ను మాట్లాడేందుకు సిగ్గు పడతారు. కానీ అద్భుతంగా తీశారు. మనకు జరిగిందే స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా? అని అందరూ కనెక్ట్ అవుతారు.

దిల్ రాజు బ్యానర్‌లో వచ్చిన ‘బొమ్మరిల్లు’ రేంజ్‌లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది”అని తెలిపారు. సందీప్ రెడ్డి బండ్ల మాట్లాడుతూ.. “మా మూవీని ఇది వరకు చాలా చోట్ల ప్రదర్శించాం. మీడియా కూడా మా సినిమాను చూసింది. అందరూ మంచి ప్రశంసలు కురిపించారు. సుహాస్ వల్లే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లింది. మలయాళీ అయినా సంగీర్తన తెలుగులో డబ్బింగ్ చెప్పారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుహాస్, సంగీర్తన, పీకే, రోల్ రైడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News