Monday, December 23, 2024

నిజాయితీకి, ప్రజాస్వామ్యానికి మధ్య జరిగే సంఘర్షణ..

- Advertisement -
- Advertisement -

విఆర్ పి క్రియేషన్స్ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో సుమన్, అజయ్ ఘోష్, కిషోర్, వెంకట రమణ, ప్రగ్య నైనా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘జనం’. వెంకట రమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరా బాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సుమన్, అజయ్ ఘోష్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్, వి.సముద్ర, పసుపులేటి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను ఒంగోలులో షూటింగ్ చేశాం.

‘నేటి భారతం’ కూడా అక్కడే షూటింగ్ జరిగింది. అదే కోవలో వస్తోన్న చిత్రమిది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అవినీతితో పాటు అన్యాయాలు, అక్రమాల గురించి దర్శకుడు చాలా చక్కగా ఈ సినిమాలో చూపించారు. సందేశంతో పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఈ సినిమాలో ఉంటుంది” అని అన్నారు. దర్శక నిర్మాత పసుపులేటి వెంకట రమణ మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను మాజీ నక్సలైట్‌గా నటించాను. ఇందులో హీరో సుమన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. జనం చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా చేస్తున్నా. పార్ట్ 1 షూటింగ్ పూర్తయింది. నిజాయితీకి, ప్రజాస్వామ్యానికి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News