- Advertisement -
నల్లగొండ: ఏడు సార్లు గెలిచి నాగార్జున సాగర్‌కు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జానా రెడ్డి చేసిందేమీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ జోరుగా ప్రచారం చేపట్టింది. నందికొండ మున్సిపాలిటి హిల్‌కాలనీలో ప్రచారం సందర్భంగా జానారెడ్డి మాట్లాడారు. ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. నెల్లికల్ లిఫ్ట్ ఏడాదిలో పూర్తి చేస్తామని జానారెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. నాగార్జున సాగర్ అభివృద్ధి టిఆర్ఎస్తోనే సాధ్యమని తలసాని స్పష్టం చేశారు. నోముల భగత్ యువకుడు, విద్యావంతుడు ఆశీర్వదించండని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -