Sunday, January 19, 2025

పవన్ కల్యాణ్ పొలిటికల్ యాడ్ మామూలుగా లేదుగా!

- Advertisement -
- Advertisement -

ఒక పొలిటికల్ యాడ్ ను ఇలా కూడా తీయొచ్చా? క్రియేటివిటీ ఉట్టిపడేలా ఉన్న జనసేన పొలిటికల్ యాడ్ ను చూసిన వెంటనే అందరూ అనుకునేమాట ఇదే! ఒక్క డైలాగ్ లేదు.. ఒక్క నినాదం లేదు. ఎవరూ తెరపై కనిపించరు కూడా! అయినా అద్భుతం అనిపించేలా షూట్ చేసారు ఈ యాడ్ ని. దీనిని చూసిన జనసైనికులు కేరింతలు కొడుతున్నారు. తమ నాయకుడు పవన్ కల్యాణ్ కు క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ అత్యంత సన్నిహితుడు కాబట్టి.. ఈ యాడ్ ను త్రివిక్రమే డైరెక్ట్ చేసి ఉంటారని వారు అంటున్నారు.

ఇంతకీ ఈ యాడ్ లో ఏముందంటే… జగన్ మాటలు నేపథ్యంలో వినిపిస్తూ ఉండగా.. పవన్ కల్యాణ్ ఫ్యాన్ స్విచ్ వేస్తాడు. వెంటనే ఫ్యాన్ గాలికి టేబుల్ పై ఉన్న కాగితాలు ఒకటొకటిగా ఎగిరిపోతూ ఉంటాయి. ఆ కాగితాలపై ఒక్కొక్క దానిపై ఒక్కోక్క టైటిల్ రాసి ఉంటుంది. రాజధాని, అభివృద్ధి, నిరుద్యోగం, ప్రత్యేక హోదా.. ఇలాగన్నమాట. వెంటనే పవన్ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. నేపథ్యంలో వందేమాతర గీతం వినిపిస్తుండగా.. నేలపై పడిపోయిన పేపర్లను తీసి టేబుల్ పై పెట్టి వాటిపై గ్లాసు (జనసేన ఎన్నికల గుర్తు)ను ఉంచుతాడు. ఈ యాడ్ మొత్తంలో పవన్ వెనుకనుంచే తప్ప ఆయన మొహం కనిపించదు. ‘పొత్తు గెలవాలి… ప్రభుత్వం మారాలి’ అనే నినాదంతో మోదీ, పవన్, చంద్రబాబు ఫొటోలున్న బ్యానర్ కనిపిస్తుండగా యాడ్ సమాప్తమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News