Friday, December 27, 2024

బిజెపితో పొత్తుపై ఇప్పుడే చెప్పలేం: పవన్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వైసిపి వ్యతిరేక ఓటు చీలకూడదనేదే జనసేన, బిజెపి అజెండా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఢిల్లీలో బిజెపి నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. వైసిపి వ్యతిరేక ఓటు చీలకూడదనే దిశగానే చర్చలు సాగాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజ్యాంగ విరుద్ధ పాలన, అవినీతి, దాడులపై చర్చించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం సాధన దిశగా అడుగులు వేస్తున్నామని జనసేనాని పేర్కొన్నారు. అధికారం సాధనకు ఎలా వెళ్తే బాగుంటుందనే దిశగా ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. పొత్తులపై బిజెపితో ఎంతవరకు స్పష్టత వచ్చిందో ఇప్పుడే చెప్పలేమని వెల్లడించారు. బిజెపి నేతలతో రెండు రోజుల చర్చలు మంచి సంతృప్తినిచ్చాయని పవన్ వెల్లడించారు. వైసిపి విముక్త ఎపినే తొలి నుంచి జనసేన అజెండా అని పవన్ కల్యాణ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News