Monday, December 23, 2024

టిడిపితో కలిసి పోటీ చేస్తాం: పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. పొత్తులో భాగంగా ఒక మాట అటూ ఇటూ ఉంటుందని చెప్పారు. జనసేన-టిడిపిలు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో మూడో వంతు సీట్లు సాధిస్తామని, టిడిపితో కలిసి బలవంతులమవుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపిద్దామని పిలుపునిచ్చారు. టిడిపి రెండు సీట్లు ప్రకటించినందున, తాను కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజోలు, రాజానగరం సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News