- Advertisement -
అమరావతి: ఏప్రిల్ 22న జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఎపికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ భారీ ఆర్థక సాయాన్ని ప్రకటించింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో పహల్గామ్ అమరులకు జనసేన నివాళి కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్.. పహల్గామ్ అమరులకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. జనసేన తరఫున రూ.50 లక్షలు ప్రకటించారు. మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
- Advertisement -