- Advertisement -
హైదరాబాద్: ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో స్థిరపడిన అన్ని వర్గాల ప్రజల చూపు ఇప్పడు జనసేనవైపే ఉందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు అన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా కాన్బెర్రా నగరంలో గురువారం ఆయన మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాగబాబు మాట్లాడుతూ జనసేన అధికారంలోకి వస్తే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.
ఆస్ట్రేలియాలో స్థిరపడిన జన సైనికులు, వీరమహిళలు పార్టీ పట్ల కనబరుస్తున్న ఆదరణ చూస్తుంటే జనసేన అధికారంలోకి వస్తుందన్న నమ్మకం పెరుగుతోందన్నారు. ఆస్ట్రేలియా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యూజిలాండ్ జనసేన, వీరమహిళలతో నాగబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, హైపర్ ఆది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -