Monday, December 23, 2024

పవన్ కటౌట్ చూసి ఆ సిఎం వణికిపోతున్నారు…

- Advertisement -
అమరావతి: వైసిపి నాయకులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోభియో పట్టుకుందని జనసేన నేత పోతిన మహేష్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తిన ఫోటో చూసినా కటౌట్ చూసిన వైసిపి నాయకులు, సిఎం జగన్ మోహన్ రెడ్డి వణికి పోతున్నారని, బ్రో సినిమా గురించి డైరెక్టర్ ప్రొడ్యూసర్లు మాట్లాడుతారు కానీ వైసిపి మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తాము కూడా రాబోయే ఎన్నికల కోసం ఒక వెబ్ సిరీస్ తీయాలనుకుంటున్నామని తెలియజేశారు. వెబ్ సిరీస్ అని ఎందుకు అంటున్నాను అంటే తన దగ్గర కాలనీలు, పోలవరం నిర్మాణాల కాంట్రాక్టర్ దగ్గర కొట్టేసిన కమిషన్ ఏమి లేవన్నారు. అందుకనే బాగా లోబడ్జెట్ లో ఒక్క వెబ్ సిరీస్ తీస్తానని పోతిన మహేష్ చెప్పారు.
ఆ వెబ్ సిరీస్ కి టైటిల్ ఖరారు చేయడానికి కొంతమంది సూచనలు సలహాలు అవసరం అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టానని వివరించారు. ఆ వెబ్ సిరీస్ టైటిల్స్ ఏది బాగుంటుందో ప్రజలే చెప్పాలన్నారు.
1. తల్లి చెల్లి ఒక ఖైదీ నెంబర్ 6093
2.D/O వివేకా
3.A” X “E
4. గంజాయి మిస్ అయిన అమ్మాయి మధ్యలో ఇసుక దిబ్బలు
5. కోడి కత్తి సమేత శ్రీను
6. డ్రైవర్ డోర్ డెలివరీ
7. అరగంట అద్దె ఇల్లు
8. ఓ ఖైదీ వదిలిన బాణం
9.RGF (R… గర్ల్ ఫ్రెండ్)
అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండడంతో వారాహి యాత్ర విజయవంతంగా గోదావరి జిల్లాలో కొనసాగుతున్నందున వైసిపి నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అమ్మవారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ పై సంపూర్ణంగా ఉన్నాయని, అమ్మవారి ఆశీస్సులు సిఎం జగన్ మీద లేకపోవడంతో దేవాలయాలు, రథాలు విగ్రహమూర్తులు ధ్వంసమయ్యాయని, గోమాతలు మరణించాయని పోతిన మహేష్ దుయ్యబట్టారు. సూట్ కేస్ కంపెనీల ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీ చేయడం సిఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపి విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ కు బాగా తెలుసునని ఆరోపణలు చేశారు.  అందుకే సిఎం జగన్ మోహన్ రెడ్డిపై 13 సిబిఐ కేసులు, 3 ఇడి కేసులు, 16 నెలల జైలు శిక్ష అనుభవించారని చురకలంటించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News