- Advertisement -
తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తుకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు కనబడుతోంది. జనసేనకు పదకొండు సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, తాండూరు, నాంపల్లి, మల్కాజిగిరి, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, నాగర్ కర్నూలు, కోదాడ అసెంబ్లీ సీట్లను జనసేనకు కేటాయించింది.
పొత్తుపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. పొత్తుపై పవన్ కల్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. తెలంగాణ నుంచి జనసేన పోటీ చేయడం ఇదే మొదటిసారి.
- Advertisement -