Sunday, December 22, 2024

డిజిపి కార్యాలయం ముందు వీరమహిళ విభాగం నిరసన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని జనసేన వీరమహిళ విభాగం హెచ్చరించింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై చర్యలు ఉంటాయని, వైసీపీ అనుబంధ యూట్యూబ్ ఛానెల్స్, పలు మీడియా సంస్థలపై డిజిపికి ఫిర్యాదు చేస్తున్నట్లు జనసేన పేర్కొంది. పవన్ పై అవమానకరమైన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జనసేన ఫైర్ అయ్యింది. సోషల్ మీడియా కార్యకర్తలపై, నాయకులపై పిర్యాదు చేయడానికి వెళ్లిన జనసేన వీరమహిళ విభాగం నేతలను డిజిపి కార్యాలయంలోకి అనుమతించక పోవడంతో కార్యాలయం ముందు బైఠాయించిన మహిళా నాయకులు నిరసన తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News