- Advertisement -
హైదరాబాద్ : జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆయన అస్వస్థతకు గురైన వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సంతాపం
బిఆర్‌ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడం పట్ల బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ సిఎం కెసిఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి తన వెంట నడిచిన యువనేత సంపత్ రెడ్డి మరణం బాధాకరమని కెసిఆర్ పేర్కొన్నారు. సంపత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. శోకంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
- Advertisement -