- Advertisement -
హైదరాబాద్: జనగామ కలెక్టరేట్ భవనంపైకి ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పురుగుల మందు తాగి నిమ్మల నర్సింగరావు ఆత్మహత్యకు యత్నించాడు. తన భూమిని ఇతరుల పేరు మీద పట్టా చేశారని నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆత్మహత్యకు యత్నించిన నర్సింగరావును పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
- Advertisement -