Sunday, December 22, 2024

టిఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత‌లు, కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

Jangaon Congress leaders joined TRS

 

పాల‌కుర్తి: జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం దేవరుప్పుల మండ‌లం చౌడూర్ గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు టిఆర్ఎస్ లో చేరారు. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నేతృత్వంలో జనగామ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి స‌మక్షంలో వారు పాలకుర్తిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం గులాబీ కండువాలు క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వారికి స్వాగ‌తం ప‌లికారు. పార్టీలో క‌లిసి, అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొనాల‌ని సూచించారు. పార్టీలో కొత్త‌గా చేరిన వారికి కూడా స‌రైన గౌర‌వం ద‌క్కే విధంగా చూస్తామ‌న్నారు. కాగా, గ‌త కొంత కాలంగా తాము రాష్ట్రంలో సిఎం కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ పార్టీ ప్ర‌భుత్వం, నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప‌నితీరు, చేస్తున్న అభివృద్ధికి ఆక‌ర్షితుల‌మై టిఆర్ఎస్ లో చేరుతున్నామ‌ని తెలిపారు. దేవరుప్పుల మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు తీగల దయాకర్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో చౌడూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఇనుముల శ్రీనివాస్, ప్రకాష్, ఉపేందర్, గడ్డం నరేష్, శ్రీనివాస్, యాకయ్య, ఏడేల్లి సోమన్న, చంద్రశేఖర్, మంద సాగర్, అజయ్ గంగారపు అరవింద్, తరుణ్, పెడవెల్లి బన్నీ, త‌దిత‌రులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీపీ బస్వ మల్లేశం, సోమనర్సయ్య త‌దిత‌రులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News