Wednesday, January 29, 2025

అంబానీ పెళ్లి వేడుకకు బాయ్ ఫ్రెండ్ తో వచ్చిన శ్రీదేవి కూతురు

- Advertisement -
- Advertisement -

గుజరాత్ లోని జామ్ నగర్ లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు దేశవిదేశాలనుంచి సెలబ్రిటీస్ వచ్చి, కాబోయే జంటకు అభినందనలు తెలిపారు. ఒకప్పటి అందాల తార శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ ల ముద్దుల కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కు ఈ వేడుకలకు హాజరైంది.. అయితే ఒంటరిగా కాదు, జంటగా! తన చిరకాల బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలసి రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. గతంలో ఈ విషయమై విలేఖరులు ప్రశ్నించినా, జాన్వీ సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చింది. కానీ, అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు జాన్వీ-శిఖర్ ఇద్దరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకుని రావడం విశేషం.

రాహుల్ తో కలసి వచ్చిన శ్రద్ధాకపూర్

ఈ వేడుకలకు బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ మోడీతో కలసి వచ్చింది. ఒక పబ్లిక్ ఫంక్షన్ కు వారిద్దరూ కలసి హాజరు కావడం ఇదే మొదటిసారి. వీరిద్దరూ గత ఏడాది కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News