ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ ప్రాజెక్ట్‌ను తమిళ దర్శకుడు అట్లీతో చేయబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రంగా హెవీ వీఎఫ్‌ఎక్స్ వర్క్‌తో రూపొందించబోతున్నారు. ఈ సినిమా నెవర్ బిఫోర్ కథగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఎంపికైందట. ఇప్పటికే ఆమెకు ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ కూడా చేసినట్లు చిత్ర వర్గాల టాక్. అల్లు అర్జున్‌తో మృణాల్ ఫ్రెష్ పెయిర్‌గా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట.
ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉండనుందట. ముగ్గురు హీరోయిన్లతో ఈ సినిమా క్రేజ్ నెక్స్ లెవెల్‌కు వెళ్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అంతేకాకుండా అల్లు అర్జున్ తొలిసారి తన కెరీర్‌లో డబుల్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.