Wednesday, December 18, 2024

గెస్ట్ రోల్లో జాన్వీ కపూర్!

- Advertisement -
- Advertisement -

దివంగత సీనియర్ నటి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జన్వీకపూర్.. అనతీకాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం దేశంలోనే క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.నార్త్ తోపాటు సౌత్ పై కూడా ఫోకస్ పెట్టింది జాన్వీ. సౌత్ లో మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘దేవర’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. ఇదిలావుంటే.. హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్ ఈ బ్యూటీ అతిథి పాత్రలో మెరవబోతోంది.

బాలీవుడ్‌ యంగ్ హీరో ఇషాన్‌ ఖట్టర్‌ ప్రధాన పాత్రలో కరణ్‌ జోహార్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని నీరజ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం జాన్వీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘ధడక్‌’లో ప్రేమికులుగా కనిపించి అభిమానుల్ని మెప్పించిన ఇషాన్, జాన్వీ జంటను ఇప్పుడు మరోసారి తెరపైకి తీసుకొచ్చేందుకు కరణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. స్నేహబంధం నేపథ్యంలో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించడానికి ఇప్పటికే జాన్వీ అంగీకరించినట్లు మేకర్స్ తెలిపారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News