Monday, December 23, 2024

బంపరాఫర్.. #RC16లో జాన్వీ కపూర్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు మరో బంపరాఫర్ కొట్టేసింది. ఇద్దర స్టార్ హీరోలతో జత కడుతోంది ఈ భామ. ఇప్పటికే యంగ్ టగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తున్న జాన్వీ.. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ 16వ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటించనుంది.

బుధవారం జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు హ్యాపీ బర్త్ డే చెబుతూ..#RC16లోకి స్వాగతం పలికారు మేకర్స్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News