Wednesday, January 22, 2025

రామ్ చరణ్ కు జోడీగా జాన్వీకపూర్..!

- Advertisement -
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా దివంగత అందాల తార శ్రీదేవి గారాలపట్టి జాన్వీకపూర్ నటించబోతోంది. ప్రస్తుతం చరణ్.. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా గేమ్ ఛేంజర్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేదు. దీంతో మెగా ఫ్యాన్స్.. తమ ఆశలన్నీ డైరెక్ట్ బుచ్చిబాబు సానపై పెట్టుకున్నారు. RC16ని బుచ్చిబాబే డైరెక్ట్ చేస్తున్న సంగత తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ మూవీని ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో స్టార్ నటీనటులను నటించనున్నట్లే సమాచారం. ఇందులో చరణ్ సరసన హీరోయిన్ ను ఎంపిక విషయంలో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవు్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే, మేకర్స్.. హాట్ బ్యూటీ జన్వీ కపూర్ సెలక్ట్ చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి కారణం లేకపోలేదు.. ఆమె తండ్రి జోనీ కపూర్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగులో వరుస సినిమా చేస్తుందని చెప్పారు. జాన్వీ ప్రస్తుతం ఎన్టీఆర్ కు జోడీగా దేవరలో నటిస్తుందని.. ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేస్తుందని.. ఈ సినిమాతోపాటు రామ్ చరణ్ తో కూడా ఓ మూవీ చేస్తుందని తెలిపాడు. RC16 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నాడు. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆప్డేట్ రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News