Wednesday, April 2, 2025

‘అదేం నడక’.. జాన్వీ కపూర్‌ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

- Advertisement -
- Advertisement -

అందాల నటి జాన్వీ కపూర్‌ని నెటిజన్లు మరోసారి ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నెటిజన్ల విమర్శలను ఎదురుకున్న జాన్వీ.. మరోసారి ట్రోల్స్‌ని ఎదురుకుంటోంది. అందుకు కారణంగా ఆమె నడకే. తాజాగా జాన్వీ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో జాన్వీ ర్యాంప్‌ వ్యాక్ చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా బ్రాండ్ కోసం ఆమె ఈ ఈవెంట్‌లో ఆయన డిజైన్ చేసి దుస్తుల్లో మెరిసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అయితే ఈ ర్యాంప్‌ వాక్‌లో జాన్వీ చాలా వేగంగా నడుస్తూ.. కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు చూసిన కొందరు నెటిజన్లు జాన్వీ అందానికి ఫిదా అయ్యామని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. ‘ఏదో ఫైట్ మిస్ అవుతున్నట్లు ఆ నడక ఏంటి’ అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

కాగా, ‘దేవర’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ తొలి సినిమాతోనే మంచి సక్సెస్‌ను అందుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పలు బాలీవుడ్ సినిమాలతో కూడా ఆమె బిజీగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News