Sunday, December 22, 2024

గోవాలో జానీ మాస్టర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషను సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గోవాలోని లాడ్జిలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్‌ఓటి పోలీసులు అక్కడి కోర్టులో హాజరు పర్చి నగరానికి తీసుకుని వస్తున్నారు. పోలీసులు జానీ మాస్టర్‌ను నేరుగా ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడంటూ ఆయన వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువతి(21) ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడని, 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరానని యువతి తెలిపింది. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తోపాటు తాను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లామని, అక్కడ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని. సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు.

దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. లైంగిక వాంఛ తీర్చనందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికి కొట్టాడని, మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడని, వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకొచ్చేశానని తెలిపింది. సొంతంగా పనిచేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బందిపెట్టాడని, ఆగస్టు 28న తమ ఇంటి గుమ్మానికి గుర్తుతెలియని వ్యక్తులు ఓ పార్సిల్ వేలాడదీశారని, అందులో ’మగబిడ్డకు అభినందనలు. కానీ జాగ్రత్తగా ఉండు’ అని రాసి ఉంది‘ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. మైనర్‌గా ఉన్నప్పటి నుంచే తనపై అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ మాస్టర్ పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ వేశాడు. లద్దాఖ్‌లో ఉన్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లిన సైబరాబాద్ పోలీసులకు చిక్కకుండా పరారయ్యాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటాడి గోవాలో పట్టుకున్నారు. జానీ మాస్టర్‌ను పట్టుకోవడం కోసం నాలుగు బృందాలు వివిధ ప్రాంతాలకు వెళ్లాయి.

అణగదొక్కాలని ఇరికించారుః అయేషా, జానీ బాష భార్య
తన భర్త కేరీర్‌లో ఎదుగుతున్నాడని, జాతీయ అవార్డు వచ్చినప్పటి నంచి జానీ మాస్టర్‌పై కుట్రలు పన్నుతున్నారని అతడి భార్య అయేషా తెలిపారు. ఆమె గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టుపై స్పందించేందుకు ఆయన భార్య సుమలత నిరాకరించారు. ఓ ఫేక్ కాల్ వచ్చిందని, దానిపై ఆరా తీసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News