Wednesday, January 22, 2025

జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్

- Advertisement -
- Advertisement -

అత్యాచార ఆరోపణలపై అరెస్టయిన టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టు గురువారం మధ్యంతరబెయిల్ జారీ చేసింది. ఐదు రోజులు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. చంచల్‌గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో 6న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా.. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్‌ను గత నెలలో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

గోవాలో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గా ల వాదనలూ విన్న న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ప్రస్తుతం చంచల్‌గూడ్ జైలులో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News