Sunday, December 22, 2024

రూ. 100కే చొక్కా..బేరమాడిన జపాన్ దౌత్యవేత్త

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో ఒకటైన జపాన్‌కు భారత్‌లో రాయబారి ఆయన.సామాన్య పౌరుడిలా ముంబై లోకల్ రైలులో ప్రయాణింరడమేగాక ఫుట్‌పాత్ షాపింగ్ కూడా చేశారు. భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకీ గురువారం ముంబైను సందర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలుసుకున్న తర్వాత ముంబై వీధుల్లో కాలినడకన తిరుగుతూ ఫుట్‌పాత్ మీద అమ్మే దుకాణదారులతో బేరాలు ఆడారు.

రూ. 100కు ఒక చొక్కా అమ్మే దుకాణం వద్ద నిలబడి ఫోటో తీసుకున్న సుజుకీ ఇంతలా బేరమాడవచ్చా అంటూ ఆశ్చర్యపోయారు. రూ. 100 చొక్కా కొనవచ్చా అంటూ ట్విట్టర్‌లో ఆయన ఫోటోతో సహా ట్వీట్ చేశారు.

దీనిపై నెటిజన్ల నుంచి భిన్న స్పందన వ్యక్తమైంది. ఆయన నిరాడంబరత్వానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఒక నెటిజన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. మా పుణెకు వస్తే 100 రూపాయలకు 4 చొక్కాలు కొనవచ్చు అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు౯.

ఏదేమైనా..జపాన్‌కు చెందిన ఒక దౌత్యాధికారి ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా అతి సామాన్యుడిలా నగర వీధుల్లో తిరుగుతూ షాపింగ్ చేయడం నెటిజన్ల హృదయాలను దోచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News