Wednesday, January 22, 2025

పెట్టుబడుల వరద

- Advertisement -
- Advertisement -

రూ.576 కోట్లతో ముందుకొచ్చిన జపాన్ కంపెనీలు 
డైఫుకు పెట్టుబడి రూ.450కోట్లు, నికోమాక్ తైకిషాకు రూ.126 కోట్లు 
ఐటి, పరిశ్రమల శాఖమంత్రి కెటిఆర్ సమక్షంలో ఎంఒయులు కుదుర్చుకున్న కంపెనీలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దీంతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోంది. దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు హైదరాబాద్‌కు పరుగు లు తీస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం జపాన్‌కు చెందిన రెండు కంపెనీలు రాష్ట్రంలో మొత్తం రూ.576 కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, సంబంధిత అధికారుల సమక్షంలో జపాన్‌కు చెందిన కంపెనీలు ఒక ఎంఒయు చేసుకున్నాయి.

ఇందులో డైఫుకు (DAIFUKU) సంస్థ రాష్ట్రంలో ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ టెక్నాలజీని అందించే ప్రపంచంలోని ప్రముఖ ప్రొవైడర్ రు.450 కోట్లతో పెట్టుబ డి పెట్టనుంది. ఇందులో మొదటి దశలో రూ.200కోట్లు, మలి దశలో రు.250 కోట్లను పెట్టనుంది. అలాగే నికోమాక్ తైకిషా క్లీన్‌రూమ్స్ ప్రైవే టు లిమిటెడ్ సంస్థ. తన క్లీన్‌రూమ్‌ల ఉత్పత్తిని వి స్తరించడానికి, హెచ్‌విఎసి సిస్టమ్‌లను ఉత్పత్తి చే యడానికి రు.126 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో తన మూడవ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చే యనుంది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మా ట్లాడుతూ, కరోనా తర్వాత కూడా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సంతోషంగా ఉందన్నారు. అనేక

మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఈ రంగంలో జపాన్ అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు సాగుతోందన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో జపాన్ ప్రపంచానికి ఆదర్శమన్నారు. ఆ దేశంలో తయారీ రంగ సంస్కృతి అ త్యంత అద్భుతమన్నారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో తయారీ రంగానికి కేంద్రంగా ఉన్న చైనా అవతల అనేక సంస్థలు తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయ త్నం చేస్తున్నాయన్నారు. ఈ అవకాశాన్ని భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడవద్దు అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు దృష్టి సారించిన చైనా ప్లస్ వన్ ఆలోచనను భారతదేశం అందిపుచ్చుకోవాలవని ఈ సందర్భంగా కెటిఆర్ సూచించారు. అద్భుతమైన మానవ వనరులు భారతదేశానికి ఉన్న కీలక అనుకూలతలని అన్నారు. భారతదేశంలో తయారీ రంగానికి అద్భుతమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. నగరంలో ఉన్న విస్తృతమైన దేశీయ మార్కెట్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్ కి అవసరమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు వీలుందన్నారు.

కార్ల డిజైనింగ్ తయారీపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు కార్ల డిజైనింగ్ తయారీపై దృష్టి సారించాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా తెలంగాణ ఉత్పత్తులను అందించాలని కోరారు. జపాన్ కు చెందిన ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సొల్యూషన్ డైఫుకు సంస్థ తెలంగాణలో అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. అత్యాధునిక ఫ్యాక్టరీ ద్వారా ఆటోమేటెడ్ స్టోరేజ్, రిట్రీవర్ సిస్టమ్స్, సార్టింగ్ ట్రాన్స్ఫర్, వెహికిల్స్ కన్వేయర్ల వంటి వరల్ క్లాస్ పరికరాలు తయారవుతాయని తెలిపారు. జపాన్‌లో సుజుకీ తయారీ మ్యూజియాన్ని సందర్శించానని…. అక్కడ విద్యార్థుల కార్ల తయారీకి మంత్రముగ్ధుడిని అయ్యాయని ఈ సందర్భంగా కెటిఆర్ పేర్కొన్నారు.

భారత్ మొత్తాన్ని ఒకే గాటన కట్టకండి!
భారతదేశం మొత్తాన్ని ఒకే గాటన కట్టకుండా దేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల పారిశ్రామిక పాలసీలు పరిపాలన విధానాలను దృష్టిలో ఉంచుకోవాలని పారిశ్రామిక వేత్తలకు ఈ సందర్భంగా కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. దేశంలోకి పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణేఅ త్యంత అనువైన ఎంట్రీ అని కెటిఆర్ అన్నారు.
మన దేశానికి చెందిన పెట్టుబడిదారులు కేవలం ఇండియా కోసం కాకుండా ప్రపంచానికి సరిపడా తమ ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. అనంతరం డైఫుకు సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గరిమెళ్ల మాట్లాడుతూ, ఇండియాలో తమ ఉత్పత్తుల తయారు వేగవంతం చేస్తామన్నారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ సామర్త్యంతో ఉత్పత్తులు చేస్తామని తెలిపారు.మంత్రి కెటిఆర్‌ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News