Monday, December 23, 2024

రజనీ మానియా: జైలర్ చూసేందుకు చైన్నైకు వచ్చిన జపాన్ జంట (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే పడిచచ్చే అభిమానులు ఉంటారని తెలుసుకాని తమ అభిమాన నటుడి చిత్రాన్ని చూసేందుకు జపాను దేశస్థులైన ఒక జంట ఏకంగా ఒసాకా నుంచి చెన్నై వచ్చిందంటే నమ్ముతారా…

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ బుధవారం విడుదలైంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన జైలర్‌కు ఇప్పటికే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

కాగా..రజనీకాంత్‌కు దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు కాని తమ అభిమాన నటుడి చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో చెన్నైలో చూసేందుకు ఒక జపాను జంట ఏకంగా విమానంలో వచ్చేయడం మాత్రం ఇంతవరకు వినలేదు. యసుదా హిడెతోషి అనే ఈ జపాను దేశస్థుడు ఆ దేశంలో రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు, తన భార్యతో కలసి ఆయన జైలర్ సినిమా చూసేందుకు నేరుగా చెన్నై వచ్చేశాడు.

రజనీకాంత్ బొమ్మతో ఉన్న టీషర్టులు ధరించిన ఈ జంట చేతిలో రజనీకాంత్, తమన్నాల కావాలా అనే పాట రాసి ఉన్న విసనకర్రలు పట్టుకుని థియేటర్ వద్ద దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైలర్ చూసేందుకే తామిద్దరం జపాన్ నుంచి చెన్నై వచ్చామని హిడెతోషి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News