- Advertisement -
జపాన్ లో భూకంపం సంభవించి వారం రోజులు కూడా గడవకముందే మరోసారి భూమి కంపించింది. జపాన్ సముద్రతీరంలో భూకంపం వచ్చిందనీ, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైందనీ అధికారులు చెప్పారు. కొత్త సంవత్సరం రోజున దాదాపు 121 సార్లు భూప్రకంపనలు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 200మంది వరకూ మరణించగా, 500మంది గాయపడ్డారు. తాజాగా మళ్లీ భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు బెంబేలెత్తి, ఇళ్లు వదిలి రోడ్లపైకి వచ్చేశారు. తాజా భూకంపంలో అనేక ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
- Advertisement -