Monday, December 23, 2024

గుక్కెడు నీళ్లు..పిడికెడు తిండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భూమి సెగలు రగిలించి, సునామీ అలలు పుట్టించిన జపాన్ భూకంపం మిగిల్చిన కష్టనష్టాలు వెలుగులోకి వస్తున్నాయి. వరుస ప్రకంపనలతో జనం రోడ్డున పడాల్సి వచ్చిన జపాన్‌లో సుజూ సిటీ భారీ స్థాయిలో విధ్వంసం జరిగింది . గురువారం నాటికి మృతుల సంఖ్య 81కు చేరుకుంది. వందలాది మంది గాయపడ్డారు. ఈ వారాంతంలో తిరిగి భూ ప్రకంపనలు చోటుచేసుకుంటాయని హెచ్చరికలు వెలువడటంతో జనం ఇళ్ల కన్నా వీధులే నయం అని గడపాల్సి వస్తోంది. వాజిమా నగరంలో 47 మంది, సుజూలో 23 మంది చనిపోయారు. ఇతర చోట్ల కూడా మృతుల గురించి సమాచారం నిర్థారణ అయింది. గాయపడ్డ వారి సంఖ్య 330 వరకూ ఉంటుంది. వీరిలో కనీసం పాతిక మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఇక భూకంపం తరువాత ఇప్పటికీ జాడతెలియకుండా పోయిన వారి సంఖ్య 80కి చేరింది.

ఇందులో బాలలు కూడా ఉన్నారు. నూతన సంవత్సర వేడుకలలో పాల్గొనేందుకు ఈ భూకంప తాకిడి ప్రాంతానికి వచ్చిన దశలో పలువురు విషాదాంతం చెందారు. విలయ తాకిడి ప్రాంతాలలో సహాయక చర్యలకు ఇప్పటికీ మొత్తం 4600 మంది సైనికులను రంగంలోకి దింపారు. ముందుగా కేవలం 1000 మందిని సహాయక పనులకు దింపగా, పరిస్థితి తీవ్రతను గమనించి ప్రధాని ఫుమియో కిషిడా ఈ సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఇప్పడు దాదాపు 35000 మంది వరకూ నిరాశ్రయులై పునరావాస కేంద్రాలలో ఉన్నారు. వీరికి మంచినీరు, ఆహారం, స్నానాల ఏర్పాట్లు జరిగాయి. అయితే అవసరాలకు తగ్గ సంఖ్యలో సహాయక సామాగ్రి, తిండి దొరకడం లేదని పలువురు వాపోతున్నారు. తమకు చిన్న గిన్నెలో ఆహారం, కప్పు మంచినీరు ఇచ్చారని వయో వృద్ధుడు యసూవు కొబటాకే తెలిపారు. భార్యతో కలిసి ఈ వృద్ధుడు ఓ స్కూల్‌లో ఏర్పాటు అయిన శిబిరంలో ఉంటున్నారు . తమకు ఓ గుక్క నీరు, పిడికెడు అన్నం దక్కిందని , ఏం చేస్తాం? రోజులు గడవాల్సిందే అని వాపొయ్యాడు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News