Monday, January 20, 2025

జపాన్ లో 62 కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జపాన్‌లో కొత్త సంవత్సరం నాడు సంభవించిన భారీ భూకంపం సృష్టించిన విలయం విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క సోమవారమే దేశంలో తీవ్రమైన 155 భూప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేటుపై 37.6 పాయింట్ల మధ్యలో నమోదయ్యాయి. మంగళవారం కూడా ఇక్కడ ఆరు సార్లు భూమి కంపించింది. కాగా భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి 55 ఉన్న  మృతుల సంఖ్య బుధవారం ఉదయానికి 62 కి చేరింది.భవనాలు కూలడం, అగ్నిప్రమాదాల కారణంగానే ఎక్కువ మంది చనిపోయారు. భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News