Monday, December 23, 2024

ప్రయోగించిన క్షణాల్లోనే పేలిపోయిన జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్

- Advertisement -
- Advertisement -

టోక్యో : జపాన్ చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. పశ్చిమ జపాన్ లోని వకయమ ప్రిఫిక్చర్ లోని లాంచ్ ప్యాడ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ చిన్న ప్రభుత్వం ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగికి ఎగిరింది. కానీ కొన్ని క్షణాల్లోనే ఇది పేలుడుకు గురై గాల్లోనే అగ్ని గోళంలా మారిపోయింది.

దీని శకలాలు చుట్టూ ఉన్న పర్వత పాదాలపై పడ్డాయి. దీంతో తక్షణమే అక్కడ ఉన్న నీటి స్ప్రింకర్లు పనిచేయడం మొదలు పెట్టాయి. మరోవైపు పేలుడు ఫలితంగా లాంచ్ ప్యాడ్ ఏరియా మొత్తం నల్లడి పొగ కమ్మేసింది. వాస్తవానికి ప్రయోగించిన 51 నిమిషాల్లోనే ఈ రాకెట్ ఉపగ్రహాన్ని కక్ష లోకి చేర్చాల్సి ఉంది. టోక్యోకు చెందిన స్పేస్ వన్ సంస్థ ఈ రాకెట్‌ను నిర్మించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఆ దేశంలో శాటిలైట్‌ను కక్ష లోకి ప్రవేశ పెట్టిన తొలి ప్రైవేట్ సంస్థగా ఇది రికార్డు సృష్టించేది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లోకి అడుగు పెట్టాలని భావించిన జపాన్ తాజా వైఫల్యంతో కొంత నిరాశ చెందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News