Sunday, December 22, 2024

‘జపాన్’ క్రేజీ ఎంటర్‌టైనర్..

- Advertisement -
- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్‌ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించారు. ఇటివలే విడుదలైన జపాన్ టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా చెన్నైలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో జపాన్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు.

ఘనంగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోలు సూర్య, విశాల్, ఆర్య, జయం రవి, దర్శకులు లోకేష్ కనకరాజ్, పా. రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ట్రైలర్ ’జపాన్’ క్రేజీ, ఫన్ ఫిల్ ఎంటర్టైనర్ అని హామీ ఇస్తుంది. ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచిఅద్భుతమైన స్పందన వస్తోంది. కార్తీ క్యారెక్టరైజేషన్ చాలా యూనిక్‌గా ఉంది. ఈ దీపావళికి జపాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News