Monday, December 23, 2024

‘జపాన్’ అడ్వెంచరస్ థ్రిల్లింగ్ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘జపాన్’ చేస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన జపాన్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ టీజర్ ని మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు.

హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒకడు కన్నమేసి రెండు వందల కోట్ల విలువల చేసే నగలు ఎత్తుకుపొతే మీ లా అండ్ ఓర్ద్ ఏం చేస్తుంది ?  
ఈ దొంగతనం స్టయిల్ చూస్తే జపాన్ ది లానే అనిపిస్తుంది. ఇండియా అంతటా జపాన్ పై 182 కేసులు వున్నాయి.
నాలుగు రాష్ట్రాల పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు. కానీ ఒక్కసారి కూడా వాడు ఎవ్వరికీ దొరకలేదు.
జపాన్ రేంజే వేరు. అమ్మాయిలు, గోల్డ్ తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా” ఇలా డిఫరెంట్ పాత్రలు జపాన్ కోసం చెప్పే వాయిస్ ఓవర్ లో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

టీజర్ లో అడ్వెంచరస్ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కార్తి డిఫరెంట్ గెటప్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ఎక్స్ ట్రార్డినరీ లుక్స్, పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని కట్టిపడేశారు కార్తి. చివర్లో  ‘ఎన్ని బాంబులు వేసిన ఈ జపాన్ ఎవరూ ఏం పీకలేర్రా” అని కార్తీ చెప్పిన డైలాగ్, వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.

అలాగే టీజర్ లో సునీల్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించారు. దర్శకుడు రాజు మురుగన్ ఇంట్రస్టింగ్ గ్రిప్పింగ్ నేరేషన్ తో కథపై క్యురియాసిటీ పెంచారు. జివి ప్రకాష్ కుమార్ నేపధ్యం సంగీతం బ్రిలియంట్ గా వుంది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ క్రిస్ప్ అండ్ షార్ఫ్ గా వుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ గా వున్నాయి. మొత్తానికి టీజర్ సినిమాపై మరింతగా అంచనాలని పెంచింది. ఈ చిత్రంలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది.  జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్.. వినేష్ బంగ్లాన్ జపాన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఈ దీపావళికి జపాన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News