Saturday, November 2, 2024

జపాన్ అణుజలాలు పసిఫిక్‌సముద్రంలోకి 3వ దఫా తరలింపు

- Advertisement -
- Advertisement -

టోక్యో : జపాన్‌లో ధ్వంసం అయిన ఫుకుషిమా అణుకేంద్రంలోని అణుధార్మిక వ్యర్థ జలాలను పసిఫిక్ మహాసముద్రంలోకి వదిలారు. ఈ ప్రక్రియను అనుకున్న విధంగా సాఫీగా నిర్వహించారు. అన్ని విధాలుగా శుద్ధి చేసి ఈ వ్యర్థ జలాలలను సముద్రంలోకి పంపించడం ఇది మూడోసారి. ఈ 3వ ప్రక్రియ ఇప్పుడు పూర్తి అయిందని దీని బాధ్యత తీసుకున్న నిర్వాహకులు తెలిపారు. 2011లో జపాన్‌లో సంభవించిన పెనుభూకంపం తరువాత సునామీతో ఈ అణుకేంద్రం పూర్తిగా దెబ్బతింది.

ఈ క్రమంలో అత్యంత ప్రమాదకరమైన అణుధార్మిక జలాలు ఈ కర్మాగారంలో భారీగా పేరుకుపోవడం అంతర్జాతీయంగా పర్యావరణ సమస్యల హెచ్చరికలకు దారితీసింది. ఈ క్రమంలో జపాన్ అన్ని విషయాలను పరిశీలించి మూడు దశల్లో ఈ వ్యర్థ జలాలను సముద్రంలోకి తరలించే ప్రక్రియను చేపట్టింది. సోమవారం 7800 టన్నుల బరువైన జలాలను సముద్రంలోకి పంపించినట్లు ఈ అణుకేంద్రం నిర్వాహక సంస్థ టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News