Thursday, December 26, 2024

జపాన్ విమానాలకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

టోక్యో : జపాన్ తన తయారీ అయిన ఒస్ప్రే విమానాలను నిలిపివేయాలని ఆలోచిస్తోంది. ఇటీవల అమెరికా ఎయిర్‌ఫోర్స్ అనుబంధమైన ఈ విమానం సముద్రంలో కుప్పకూలిన ఘటన తరువాత జపాన్ ఈ విమానాల ఉపసంహరణకు రంగం సిద్ధం చేసుకొంటోందని జపాన్‌కు చెందిన క్యోడో వార్తా సంస్థ గురువారం తెలిపింది. శిక్షణ విన్యాసాల దశలో ఈ విమానం జపాన్‌లోని దక్షిణ తీరంలో సముద్రంలో కూలింది. తాత్కాలికంగా ఈ విమానాలను సస్పెండ్ చేస్తున్నట్లు జపాన్ రక్షణ మంత్రిత్వశాఖ అధికారి ఒక్కరు సంబంధిత పార్లమెంటరీ కమిటీకి తెలిపారు. ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి వివరాలను వార్తాసంస్థ వెల్లడించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News