Saturday, November 23, 2024

టోక్యో పరిసర ప్రాంతాల్లో ఎమెర్జెన్సీ ప్రకటన

- Advertisement -
- Advertisement -

Japan to declare state of emergency for Tokyo

టోక్యో: జపాన్ రాజధాని టోక్యో, పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ కరోనా కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో 2447 వరకు నమోదవుతున్న కారణంగా జపాన్ ప్రభుత్వం, టోక్యోలోను పరిసర ప్రాంతాల్లోను మరోసారి ఎమర్జెన్సీ ప్రకటించింది. కరోనా పరిస్థితిని సమీక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ సూచనల మేరకు జపాన్ ప్రధాని యోషిహిడే ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 7 వరకు రెస్టారెంట్లు, బార్‌లు రాత్రి 8 గంటలయ్యేసరికి మూసివేయాలని జనం ఎక్కడా గుమికూడకుండా ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. షాపింగ్ మాల్స్, స్కూళ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. సినిమాహాళ్లు, మ్యూజియంలు సహా ఇతర కార్యక్రమాల్లో జనం రద్దీ తక్కువగా ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల పేర్లను బహిరంగంగా జాబితాలో పెడతారు. నిబంధనలు పాటించిన వారికి ప్రోత్సాహం అందించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Japan to declare state of emergency for Tokyo

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News