- Advertisement -
టోక్యో : జపాన్ లోని టోక్యో, మరో 18 ప్రాంతాల్లో కరోనా వైరస్ ఎమర్జెన్సీని సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. కొత్త కరోనా కేసుల ఉధృతి కాస్త తగ్గినప్పటికీ హెల్త్ కేర్ వ్యవస్థలు ఒత్తిడికి గురౌతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. గత మేలో ఒకియానాలో విధించిన ఈ ఎమర్జెన్సీ క్రమేణా పొడిగించగా ఈ ఆదివారానికి పూర్తి కావలసి ఉంది. సుదీర్ఘకాలంగా ఎమర్జెన్సీని పొడిగిస్తున్నా ప్రజలు నిబంధనలు సరిగ్గా పాటించక పోవడంతో నియంత్రణ చర్యలు అంతగా ఫలించడం లేదు. ఈ సందర్భంగా ప్రదాని యోషిహిడె సుగా తీవ్రమైన కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయని, చాలా ఆస్పత్రులు కేసులతో నిండిపోతున్నాయని చెప్పారు. ప్రజలు సామాజిక దూరంతోపాటు ఇతర నిబంధనలు తుచ తప్పకుండా పాటిస్తేనే సాధారణ జీవన మార్గం లోకి మనం రాగలమని ఆయన విజ్ఞప్తి చేశారు.
- Advertisement -