Wednesday, January 22, 2025

రూ.3.2లక్షల కోట్ల జపాన్ పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

Japan will invests Rs 3.2 lakh crore in India

న్యూఢిల్లీలో ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని కిషిడా
భేటీ ఆరు ఒప్పందాలపై సంతకాలు రెండు
ఆసియా దేశాల మధ్య బలోపేతమైన బంధం

ఐదేళ్లలో భారత్‌లో 3.2 లక్షల కోట్ల జపాన్ పెట్టుబడులు
ప్రధాని మోడీ కిషిడాల ఉన్నత స్థాయి సమావేశం
భద్రతాయుత ఇంధనం కీలక రంగాలపై దృష్టి
ఆరు ఒప్పందాలతో బలోపేత ఆసియా బంధం

న్యూఢిల్లీ : భారతదేశంలో భారీ స్థాయి పెట్టుబడులకు జపాన్ ముందుకు వచ్చింది. వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశంలో 42 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను లక్షంగా పెట్టుకుంటున్నట్లు జపాన్ భారత్‌కు తెలిపింది. ఇదిభారతీయ కరెన్సీలో రూ 3,20,000 కోట్లుగా ఉంటుంది. శనివారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ , జపాన్ ప్రధాని ప్యూమియో కిషిడా మధ్య న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జపాన్ నుంచి భారత్‌కు అత్యంత కీలకమైన స్నేహ హస్తం అందింది.

భారత్‌లో వచ్చే ఐదేళ్ల కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకర రీతిలో 5 ట్రిలియన్ యెన్‌లు ( జపాన్ కరెన్సీ) లేదా 3.2 లక్షల కోట్లు లేదా 42 బిలియన్ డాలర్ల మేర విలువైన పెట్టుబడులకు జపాన్ ముందుకు వచ్చిందని, ఈ మేరకు ప్రధాని ఫ్యూమియోతో జరిపిన భేటీ సందర్భంగా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ప్రధాని ఆ తరువాత విలేకరులకు తెలిపారు. అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి ప్రధాని ఫ్యూమియో 14వ ఇండియా జపాన్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడికి మధ్యాహ్నం తరలివచ్చారు. జపాన్ ప్రధానిగా అధికార బాధ్యతల స్వీకరణ తరువాత తొలిసారిగా జపాన్ నేత భారతదేశానికి వచ్చారు. ఉన్నత స్థాయిలో సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్త పత్రికా సమావేశంఏర్పాటు చేశారు. భద్రతాయుత, విశ్వసనీయ, కాలాతీతమైన సుస్థిర ఇంధన సరఫరా అత్యవసరం అనే విషయాన్ని ఇరుదేశాలు గుర్తించినట్లు ప్రధాని తెలిపారు.

ఆరు ఒప్పందాలపై సంతకాలు
హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు సాయం

భారతదేశపు పట్టణ మౌలిక సాధనాసంపత్తికి పూర్తి స్థాయి మద్ధతు ఇవ్వడం జపాన్ లక్షం అని ఆ దేశానికి చెందిన ప్రతినిధి బృందం తెలిపింది. తమ దేశపు ప్రతిష్టాత్మక బుల్లెటు ట్రైన్ టెక్నాలజీని సాధనంగా చేసుకుని ఏర్పాటు చేసే హై స్పీడ్ రైల్వే వ్యవస్థకు జపాన్ తోడ్పాటు ఉంటుందని జపాన్ ప్రధాని తెలిపారు. ఇప్పటి భేటీలో భాగంగా ఇరువురు నేతలు జరిపిన సమీక్ష ఫలితంగా ఆరు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పలు రంగాలలో పరస్పర సాయం, ప్రత్యేకించి స్వచ్ఛ ఇంధన భాగస్వామ్య విస్తరణపై కూడా అంగీకారం కుదిరింది. అంతకుముందు ఇరువురు నేతలు ఇక్కడి హైదరాబాద్ హౌస్‌లో సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక అనుసంధానం దిశలో భాగంగా ఇరువురు నేతలు సమీక్ష జరిపారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. 2021లో జపాన్ ప్రధానిగా కిషిడా అధికారంలోకి రాగానే ఆయనను అభినందిస్తూ ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను, ప్రపంచస్థాయిలో భాగస్వామ్యపక్షాన్ని మరింతగా విస్తృతపర్చుకోవాలని ఆ దశలోనే ఇరువురు నేతలు నిర్ణయానికి వచ్చారు. భారత్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు నెలకొని ఈ ఏడాదితో 70 ఏళ్లు అవుతాయి.

ఉక్రెయిన్ అంశంపై ఇరువురు నేతల సమీక్ష

ఇప్పుడు ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితిపై కూడా జపాన్ , భారత్ ప్రధాన మంత్రులు సమీక్షించారు. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ చర్యలతో అమానుష పరిస్థితి ఏర్పడుతోందని, ఈతూర్పు యూరోపియన్ దేశంపై రష్యా పంజా ఆసియా దేశాలపై ప్రభావం చూపుతోందని జపాన్ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా , శాంతి మౌలిక వ్యవస్థను దెబ్బతీస్తూ రష్యా చర్యలు ఉన్నాయని జపాన్ ప్రధాని విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News