Wednesday, January 22, 2025

జిహెచ్‌ఎంసిని సందర్శించిన జపాన్ ప్రతినిధుల బృందం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /సిటీ బ్యూరో: జపాన్ ప్రతినిధుల బృందం గురువారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంతో పాటు మాసబ్ ట్యాంక్ లోని సిడిఎంఏ కార్యాలయంలో గల మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ ను సందర్శించారు. జెఎస్‌సి ఎడిబిఐ సలహాదారు డా. కజుషి హషిమోటో, ప్రొఫెషనల్ ఇంజనీర్ యాచియో ఇంజనీరింగ్ కో లిమిటెడ్ అధికారి తకాషి సకాకిబారా,నిప్పన్ కోయి ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనిల్ కుమార్,మిస్టర్ ప్రొఫెషనల్ ఇంజనీర్ జపాన్ ఎడ్యుకేషన్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ శానిటేషన్ సిన్హి కుమోకావా, జెఇసిఇఎస్ సీనియర్ పరిశోధకులు యూరీ షిరకావా, అయాకో సుజుకి , జపాన్ పర్యావరణ పారిశుద్ధ్య కేంద్రం సుడో డైరెక్టర్ కట్సుయోషి, ఇంటర్నేషనల్ అఫైర్స్ జపాన్ శానిటేషన్ కన్సార్టియం మేనేజర్ డా. పియర్ ఫ్లామండ్‌తో కూడిన బృందానికి జిహెచ్‌ఎంసి కమిషనర్, సిడిఎంఎ ఇంఛార్జీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆయన జపాన్ ప్రతినిధుల బృందంతో సమావేశమైయ్యారు. ప్రైవేట్ డెస్లడ్జింగ్ ఆపరేటర్ల ఎంప్యానెల్‌మెంట్, పబ్లిక్ కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణ , వివిధ రకాల వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, అమలు చేస్తున్న సంస్కరణలను కమిషనర్ జపాన్ బృందానికి వివరించారు ఈ సందర్భంగా ‘రాష్ట్రంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎం కింద అమలు చేస్తున్న పథకాలు, సంస్కరణలను జపాన్ ప్రతినిధుల బృందం కొనియాడింది. ఈ సందర్భంగా, జపాన్‌లోని పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న వ్యర్థ నీటి నిర్వహణ వ్యవస్థల సైతం వారు కమిషనర్‌కు ఇతర అధికారులకు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News