Thursday, January 23, 2025

జపాన్ ప్రధాని ప్యూమియో కిషిదా నేడు భారత్ రాక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్‌కు జి20 సదస్సు అధ్యక్షపీఠం దక్కిన నేపథ్యంలో జపాన్ ప్రధాని ప్యూమియో కిషిదా సోమవారం ఢిల్లీ వస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటిస్తారు. ప్రధాని మోడీతో ఢిల్లీలో ఆయన చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ , అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. జి20 కూటమికి భారత్, జి7 కూటమికి జపాన్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

మోడీతో కిషిదా చర్చల్లో ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, చైనా దూకుడు వైఖరి తదితర అంశాలపై చర్చించేందుకు అవకాశం ఉంది. చైనాను కట్టడి చేసే విషయంపై లోతుగా చర్చించే అవకాశం ఉంది. సోమవారం కిషిదా ఢిల్లీలో కీలకోపన్యాసం చేస్తారు. భారత్ జపాన్ మధ్య అనేక రంగాల్లో కీలక ఒప్పందాలు ఉన్నాయి. మరిన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News